యాదాద్రీశుడి ద‌ర్శ‌నం చేసుకున్న నాచుర‌ల్ స్టార్ నాని..

యాదాద్రి (CLiC2NEWS): సినీ హీరో నాని గురువారం యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ప్ర‌ధానాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌యంలో సువ‌ర్ణ పుష్పార్చ‌న‌, అష్టోత్త‌ర పూజ‌లు నిర్వ‌హించారు. వేద పండితులు అశీర్వ‌చ‌నం చేసి, తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు. ఆల‌య ఆర్కిటెక్చ‌ర్ ఆనంద‌సాయి, డిప్యూటి స్త‌ప‌తి ఆకుల మొగిలి త‌దిత‌రులు ఆల‌య విశిష్ట‌త‌ను నానికి వివ‌రించారు. నాచుర‌ల్ స్టార్ నాని యాదాద్రికి రావ‌డంతో అభిమానులు ఆయ‌న‌తో సెల్ఫీ దిగేందుకు ఆస‌క్తి చూపారు.

1 Comment
  1. zoritoler imol says

    You are a very clever individual!

Leave A Reply

Your email address will not be published.