ఇంటర్ పూర్తి చేసిన వారికి ఉచితంగా బిటెక్ చదువు.. సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం

Indian Navy: భారతీయ నౌకాదళం 10+2 (బిటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం ప్రకటన. క్యాడెట్ ఎంట్రీ అవకాశం వచ్చిన వారికి ఇంజినీరింగ్ విద్యతో పాటు బుక్స్, వసతి, భోజనం అన్నీ ఉచితం. చదువు, శిక్షణ పూర్తయిన తర్వాత రూ.లక్ష వేతనంతో సబ్‌లెప్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటి (జెఎన్‌యు)- న్యూఢిల్లీ నుండి ఇంజినీరింగ్ డిగ్రీ ప్రధానం చేస్తారు.
నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో వీరికి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ లేదా ఎడ్యుకేషణ్ బ్రాంచి కేటాయిస్తారు. లెవెల్ 10 మూలవేతనం అందుతుంది. అంటే.. రూ. 56,100 చెల్లిస్తారు. మిలటరీ సర్వీస్ పే కింద రూ. 15,500 అదనంగా దక్కుతుంది. డిఎ, హెచ్ ఆర్ ఎ, ఇతర అలవెన్సులు అన్ని కలిపి గరిష్టంగా రూ. లక్ష కంటే ఎక్కువే అందుతుంది. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధఱకు క్యాంటీన్ సామాగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు .. ఇలా ఎన్నో ప్రోత్సహాలు అందుతాయి. సంవత్సరానికి 60 వార్షక సెలవులు, 20 సాధారణ సెలవులు ఉంటాయి. ఇది శాశ్వత ఉద్యోగం కావున పింఛను కూడా పొందవచ్చు.
ఇంటర్‌లో ఎంపిసి పూర్తి చేసి.. జెఇఇ మెయిన్ -2024లో ర్యాంకు వచ్చిన వారు నేవి 10+2 కేడెట్ స్కీంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్ , కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 70% మార్కులు ఉండాలి. పదో తరగతి లేదా ఇంటర్ ఇంగ్లిష్‌లో కనీసం 50% మార్కులు సాధించాలి. ఎత్తు కనీసం 157 సెం.మీ ఉండి.. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. వీరికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్‌బి) సెప్టెంబర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు జరిగే ప్రాంతాలు బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నం. ఇవి రెండు దశల్లో జరుగుతాయి.
అభ్యర్తులు జులై 2, 2005 నుండి జనవరి 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. దరఖాస్తులకు చివరి తేడీ జులై 20గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు https//www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.