సిఎంని కలిసిన నయన్.. పెళ్లికి ఆహ్వానం
చెన్నై (CLiC2NEWS): లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి పీటలెక్కబోతున్నవిషయం తెలిసిందే. తాజాగా ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. సిఎం నయన్, విఘ్నేశ్‌లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నయన్, విఘ్నేశ్‌ల వివాహాం జూన్ 9వ తేదీన జరగనుంది. వీరి వివాహవేడుకకు మహాబలిపురంలోని మహబ్ హోటల్ వేదిక కానుంది. సుమారు ఏడేళ్ల నుండి నయన్, విఘ్నేశ్‌లు ప్రేమలో ఉన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాది ఈ జంట నిశ్చితార్ధం జరిగింది.