న‌య‌న‌తారను చూస్తుంటే గ‌ర్వంగా ఉంది.. విఘ్నేశ్ శివ‌న్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): షారూక్ ఖాన్‌తో క‌లిసి న‌య‌న‌తార ‘జ‌వాన్’ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈచిత్రంలోని న‌య‌న‌తార ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. న‌య‌న‌తార ‘జ‌వాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారూక్‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల‌తో జ‌వాన్ సినిమా ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. 24 గంట‌ల్లో 100 మిలియ‌న్లకు పైగా వ్యూవ్స్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా ఈ పోస్ట‌ర్‌పై న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేశ్ శివ‌న్ స్పందిస్తూ.. న‌య‌న‌తార‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. నిన్ను చూస్తుంటే గ‌ర్వంగాఉంది. షారూక్ అభిమానిగా ఆయ‌న న‌టించిన సినిమాలు చూసే నువ్వు.. ఇప్ప‌డు ఆయ‌న‌తో క‌లిసి న‌టిస్తున్నావు. ఇంకా మ‌రెన్నో విజ‌యాలు అందుకోవాలని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల షారూక్.. న‌య‌న‌తార గురించి మాట్లాడుతూ ఆమె చాలా మంచి వ్య‌క్తిత్వం ఉన్న న‌టి అన్నారు. అందిరితో ప్రేమ‌, గౌర‌వంతో ఉంటుంద‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.