ఢిల్లీ విమానాశ్రయంలో రూ.6కోట్ల విలువైన నెక్లెస్ స్వాధీనం

ఢిల్లీ (CLiC2NEWS): విమానాశ్రయంలో దాదాపు రూ.6కోట్ల విలువైన నెక్లెస్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 12న ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తి అక్రమంగా 40 గ్రాముల నెక్లెస్‌ను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుజరాత్ కు చెందిన వ్యక్తి బ్యాంకాక్ నుండి ఢిల్లీ నక్లెస్‌ను తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వజ్రాలు పొదిగి ఉన్న 40 గ్రాముల ఈ నెక్లెస్ విలువ రూ.6.08 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.