Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్రా- భారత్​కు స్వర్ణం

టోక్యో (CLiC2NEWS): ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్​ కల ఫలించింది.  నీర‌జ్ చోప్రా చ‌రిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో భార‌త్‌కు  గోల్డ్ మెడ‌ల్ అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా సూప‌ర్ షో క‌న‌బ‌రిచి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్య‌ధికంగా 87.58 మీట‌ర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. అథ్లెటిక్స్‌లో నీర‌జ్ బంగారు ప‌త‌కాన్ని అందించి ఇండియాకు చిరస్మ‌ర‌ణీయ రోజును మిగిల్చాడు.

  • తొలి ప్ర‌య‌త్నంలో అత‌ను 87.03 మీట‌ర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు.
  • ఇక రెండో అటెంప్ట్‌లో అత‌ను మ‌రింత ప‌దునుగా త్రో చేశాడు.
  • సెకండ్ అటెంప్ట్‌లో 87.58 మీట‌ర్ల దూరం విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసిరాడు.

ఫైనల్లో మొత్తం అథ్లెట్లకు ఆరు సార్లు జావెలిన్​ విసిరే అవకాశం ఉంటుంది. తొలి 3 ప్రయత్నాల తర్వాత.. టాప్​-8 ప్లేయర్లకు మరో 3 ఛాన్స్​లు ఉంటాయి. క్వాలిఫికేషన్‌లోనే 86.59 మీటర్ల త్రోతో ఫైనల్​కు అర్హత సాధించి.. పసడి అందిస్తానని సంకేతాలు పంపాడు చోప్రా.

1 Comment
  1. Facebook Marketing says

    Wow, wonderful blog format! How lengthy have you ever been blogging for? you make running a blog glance easy. The whole look of your site is fantastic, let alone the content!!

Leave A Reply

Your email address will not be published.