పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త్‌కు ర‌జ‌తం అందించిన నీర‌జ్‌..

Paris Olympics:  నీర‌జ్ చోప్రా ర‌జ‌తంతో మెరిసాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త్‌కు వ‌రుస‌గా కాంస్యాలే వ‌స్తున్నాయి. ఆశ‌లు పెట్టుకున్న వారు వెనుదిరిగారు. అంద‌రి ఆశ‌లు ఇక నీర‌జ్‌పైనే పెట్టుకున్నారు. స్వ‌ర్ణం అందిస్తాడ‌ని ఎదురు చూశ‌రు. నిన్న రాత్రి జ‌రిగిన పోటీలో నీర‌జ్ ర‌జ‌తం అందుకోగా.. పాకిస్థాన్‌కు చెందిన న‌దీమ్ స్వ‌ర్ణాన్ని చేజిక్కుంచుకున్నాడు. నీర‌జ్ 89.45 మీట‌ర్లు బ‌ల్లేన్ని విసర‌గా.. అర్ష‌ద్ న‌దీమ్ ఏకంగా 92.97 మీట‌ర్లు విసిరాడు. గ‌త ఒలింపిక్స్‌లో నీర‌జ్ 87.58 మీట‌ర్ల‌తోనే స్వ‌ర్ణం అందుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ వ్య‌క్తిగ‌త విభాగంలో స్వ‌ర్ణం, ర‌జ‌తం గెలిచిన తొలి భార‌త క్రీడాకారుడిగా నీర‌జ్ చ‌రిత్ర సృష్టించాడు.

Leave A Reply

Your email address will not be published.