నీట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఢిల్లీ (CLiC2NEWS): దేశ‌వ్యాప్తంగా వైద్య‌విద్యా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే నేష‌న‌ల్ ఎలిజిబిలిటి క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ నోటిఫికేష‌న్ శుక్ర‌వారం విడుద‌లైంది. ఇంగ్లిష్‌, హింది, తెలుగుతో పాటు దేశ‌వ్యాప్తంగా మొత్తం 13 భాష‌ల్లో పెన్ను, పేప‌ర్ విధానంలో ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. ఈ నెల 9వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. నీట్ ప‌రీక్షను మే 5వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్ర‌క‌టించింది. ద‌ర‌ఖాస్తు రుసుం జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ. 1700, జ‌న‌ర‌ల్ ఇడ‌బ్ల్యుఎస్‌/ఒబిసి-ఎన్‌సిఎల్ అభ్య‌ర్థులు రూ. 1600, ఎస్‌సి, ఎస్‌టి/ దివ్యాంగులు/ థ‌ర్డ్ జండ‌ర్ అభ్య‌ర్థులు రూ. 1000 చొప్పున చొప్పున చెల్లించాలి.

Leave A Reply

Your email address will not be published.