ఎపిలో తొలి ఒమిక్రాన్ సోకిన వ్య‌క్తికి నెగెటివ్ రిపోర్ట్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వెలుగు చూసిన తొలి ఒమిక్రాన్ వేరియంట్ బారిన ప‌డ్డ వ్య‌క్తి రిపోర్ట్ నెగెటివ్ వ‌చ్చింది. విజ‌య‌న‌గం జిల్లాలోని ఒమిక్రాన్ సోకిన వ్య‌క్తి హోంక్వారంటైన్‌లోనే కోలుకున్నాడ‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు తెలిపారు. ఇటీవ‌ల ఐర్లాండ్ నుండి వ‌చ్చిన 34 ఏళ్ల వ్య‌క్తికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిన‌దే. అతనికి మ‌రోసారి ఆర్టిపిసిఆర్ ప‌రీక్ష చేయ‌గా నెగెటివ్ రిపోర్టు వ‌చ్చింద‌ని తెలిపారు. బాధితుడు ఎటువంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు లేవ‌ని, ప్ర‌థ‌మ, ద్వితీయ కాంటాక్టులైన సుమారు 40 మందికి టెస్టులు చేయ‌గా వారంద‌రికీ నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు లేవ‌ని స్ప‌ష్టంచేశారు.

‌విదేశాల నుండి 15వేల మంది ఎపికి వ‌చ్చార‌ని, వీరిలో 12,900 మందిని గుర్తించి పరీక్ష‌లు నిర్వ‌హించాగా 15 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌నన్నారు. వీరి న‌మూనాలు కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపామ‌ని తెలిపారు. వీటిలో 10 మందికి చెందిన ఫ‌లితాలు వెలువ‌డ‌గా ఒక‌రికి మాత్ర‌మే పాజిటివ్‌గా నిర్థార‌ణ‌య్యిందని తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.