Nellore: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

కావలి (CLiC2NEWS): నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుండి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారంతా కావలి డివిజన్ పరిధిలోని జలదంచి మండలం చామదల గ్రామానికి చెందిన వారుగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.