పాస్వర్డ్ షేర్ చేస్తే డబ్బులు వసూలు.. నెట్‌ఫ్లిక్స్‌కు షాకిచ్చిన యూజర్లు!
పాస్వర్డ్ షేరింగ్‌ను అరికట్టేందుకు నెల్ఫ్లిక్స్ తీసకున్న నిర్ణయం వలన ఏకంగా 10 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. పాస్వర్డ్ షేరింగ్‌కు ఛార్జ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌లో ఈ ప్రయత్నం అమలు చేసింది. ఒకే ఇంట్లో వారు కాకుండా వేరే వారు అదే అకౌంట్‌ను వాడడాన్ని నివారించేందుకు ఈ వ్యూహం అమలు చేసింది. ఒక్కో అకౌంట్‌కు నెలకు 6.57 డాలర్లు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ఇదే వ్యూహాన్ని కెనడా, న్యూజిలాండ్. పోర్చుగల్‌లలో అమలు చేసింది. స్పెయిన్‌లో దాదాపు 10 లక్షలకు పైగా యూజర్లను కోల్పోయినట్లు సమాచారం.