తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ.. నూతన మంత్రుల ప్రమాణస్వీకారం..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం ఆదివారం జరిగింది. రాజ్‌భవన్‌లో నూతన మంత్రులుగా జి.వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిచే గవర్నర్ ప్రమాణం చేయించారు. ప్రమాణం చేశారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని నూతన మంత్రులను అధిష్టానం ఎంపిక చేసింది.
అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి.. ఎమ్మెల్యే అయిన తొలిసారే మంత్రి పదవులు దక్కాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గడ్డం వివేక్ చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించగా..మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు చీఫ్ విప్ పదవి కూడా భర్తీ చేయాల్సి ఉంది.