రాజేంద్రనగర్‌లోని 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనం.. సిఎం
హైదరాబాద్ (CLiC2NEWS): రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపనకు ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు శిథిలావస్థకు చేరుకున్నందున రాజేంద్రనగర్‌లోని 100 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. జనవరిలో శంకుస్థాపన చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు.
గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని న్యాయస్థానాల స్థితిగతులు, వసతులు వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో సిఎస్ శాంతి కుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, జంటనగరాల కలెక్టర్లు, ఐఎఎస్ అధికారి నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.