హైకోర్టులో 10 మంది కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టులో 10 మంది నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ కాసోజు సురేందర్, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్, జస్టిన్ జువ్వాడి శ్రీదేవి, జస్టిస్ ఎన్.వి. శ్రావణ్ కుమార్, జస్టిన్ గున్ను అనుపమా చక్రవర్తి, జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ ఎ. సంతోష్ రెడ్డి, జస్టిస్ డి. నాగార్జున్ ప్రమాణ స్వీకారం చేశారు.
మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో 19 న్యాయమూర్తులు మాత్రమే సేవలందిస్తున్నారు. కొత్త న్యాయమూర్తుల నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 కి చేరింది.