నేడు శాసనసభలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం..
హైదరాబాద్ (CLiC2NEWS): శనివారం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధీన్ ఒవైసి నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారపక్ష, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
మరోవైపు శాసనసభ సమావేశాలకు బిజెపి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని అక్బరుద్ధీన్ ను ప్రొటెం స్పీకర్గా చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో కాకుండా.. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాత బిజెపి ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని తెలిపారు.
మరోవైపు ఇవాళ రాష్ట్ర సర్కార్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు.. గ్యారెంటీలలో రెండు హామీలను నేడు ప్రారంభించనుంది. వాటిలో ఒకటి మహిళలకు రాష్ట్రమంతా ఉచితంగా బస్సు ప్రయాణం. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కార్యక్రామాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీ నుండి ప్రారంభించనున్నారు. రెండవది..పేదలందరికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం.