ఎపిలో గ్రూప్-2, గ్రూప్-3 నియామక ప్రక్రియలో కీలక మార్పులు ..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సిపిటి) సర్టిఫికెట్ తప్పనిసరి అని .. సిపిటి పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సిపిటి పాస్ కావాలని స్పష్టం చేసింది.
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు సిపిటి పరీక్షను 100 మార్కులకు గాను నిర్వహిస్తారు. కంప్యూటర్లు, డిజిటల్ పరికారాఉల, అపరేటింగ్ సిస్టమ్స్ విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాలకు సంబంధించనవి ఉంటాయి. దీనిలో ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బిసిలు 35మార్కులు, ఒసిలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.