న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా రాజీనామా ప్రకటన..
![](https://clic2news.com/wp-content/uploads/2020/08/jesinda.jpg)
వెల్లింగ్టన్ (CLiC2NEWS): న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రాజీనామా ప్రకటన చేశారు.ప్రగతిశీల పాలనకు పేరుపొందిన ఆమె రాజీనామా ప్రకటనతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికిగురైనాయి. ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది ఎంతో ఉన్నతమైనదని.. అది అత్యంత సవాలుతో కూడినపని అన్నారు. ప్రభుత్వాన్ఇన నడిపే సామర్థ్యం పూర్తిస్థాయిలో లేనపుడు కొనసాగలేమని ఆమె అన్నారు. అయితే, రాబోయే ఎన్నికల్లో గెలవలేమని రాజీనామా చేయటంలేదని.. తప్పకుండా విజయం సాధించగలమని విశ్వసిస్తున్నానని లేబర్ పార్టీ సభ్యులతో జెసిండా మాట్లాడారు. తన రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదని తెలిపారు.
2017 వ సంవత్సరంలో జెసిండా మొదటిసారి న్యూజిలాండ్ ప్రధానిగా నియమితులయ్యారు. 2023 ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఆమె పదవిలో కొనసాగనున్నారు. అక్టోబర్ 14వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికలు వరకు ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు. కరోనా మహమ్మారి సమయంలో, అత్యంత దారణస్థాయిలో ఉగ్రదాడి జరిగిన సమయంలో ఆమె పాటించిన సంయమనం అంతర్జాతీయం ప్రశంసలు అందుకున్నారు. న్యూజిలాండ్ నూతన ప్రధానిని జనవరి 22న ఎన్నుకోనున్నారు.