ఉక్రెయిన్‌కు న్యూజిలాండ్ అదనపు సాయం
ఉక్రెయిన్‌కు పలు దేశాలల నుండి సాయం అందుతోంది. ఉక్రెయిన్‌కు అదనపు సాయం అందించేందుకు న్యూజిలాండ్ ముందుకు వచ్చింది. 3.46 మిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్రారు. ఉక్రెయిన్ దళాలకు ఇంధనం, కమ్యూనికేషన్ పరికరాలు, ప్రథమ చికిత్సకు సంబంధించిన సాయం అందించేందుకు నాటో ఫండ్‌కు నేరుగా నిధులు అందిస్తామని తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, జనావాసాలపై బాంబు దాడులు చేస్తుంది. అనేక మంది నిరాశ్రయులైనారు. లక్షల సంఖ్యలో దేశం విడిచి వెళుతున్నారు. సుమీకి ఈశాన్యం వైపు ఉన్న సుమీకిమ్‌ప్రోమ్ రసాయన పరిశ్రమపై దాడి జరిగినట్లు భావిస్తున్నారు. పరిశ్రమలోని ప్లాంట్ నుంచి అమ్మోనియా లీక్ అవుతోంది. ప్లాంట్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాలని ఆ ప్రంత గవర్నర్ జివిత్క్సీ హెచ్చరించారు. గ్యాస్ లీక్ వలన ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.