India Corona: కొత్తగా 14,313 కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,42,60,470కి చేరాయి.
- ఇప్పటి వరకు 3,36,41,175 మంది కోలుకున్నారు.
- ప్రస్తుతం దేశంలో 1,61,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- ఇప్పటి వరకు దేశంలో 4,57,740 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారు.
- గత 24 గంటల్లో 13,543 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
- గత 24 గంటల్లో 549 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.