India Corona: కొత్తగా 43 వేల కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గ‌డిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో కొత్తగా 43,393 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ శుక్ర‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,07,52,950కి చేరింది.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 44,459 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.  ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 2,98,88,284 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
  • ప్ర‌స్తుతం దేశంలో 4,58,727 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 911 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 4,05,939 మంది కరోనా మహమ్మారి వల్ల మరణించారు.
  • గత 24 గంటల్లో 40,23,173 డోసులను పంపిణీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 36,89,91,222 చేరిందని ఆరోగ్య‌శాఖ పేర్కొన్నది.
  • దేశవ్యాప్తంగా జూలై 8 వరకు 42,70,16,605 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 17,90,708 నమూనాలను పరీక్షించామని తెలిపింది.
Leave A Reply

Your email address will not be published.