శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
నిజామాబాద్ (CLiC2NEWS): మహారాష్ట్రలో… అలాగే ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల మూలంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రవాహం కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
- ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 21,580 క్యూసెక్కులు
- ప్రాజెక్టు ఔట్ ఫ్లో 3,500
- జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు.
- ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులు
- ప్రాజెక్టులో ప్రస్తుతం 90.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది.