మావోయిస్టులతో సంబంధాలు.. ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ
హైదరాబాద్ (CLiC2NEWS): మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగంతో చైతన్య మహిళా సంఘం (సిఎంఎస్) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఎ) అధికారులు అరెస్టు చేశారు. 2017 డిసెంబర్లో విశాఖలో తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్తు పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర.. రాధను తీసుకెళ్లనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.