Night Curfew: తెలంగాణలో పొడిగింపు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో క‌రోనా ఉధృతి పెరుగుతుండటంతో మరికొన్ని రోజులు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించింది. మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. య‌థావిధిగా రాత్రి 9గంట‌ల నుంచి  ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది.

కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉద‌యం (నేటి వ‌ర‌కు) కర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. కర్ఫ్యూ నేటితో ముగియనుండ‌టంతో ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతుండ‌టంతో మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్ర‌భుత్వం యోచించింది.

Leave A Reply

Your email address will not be published.