ఎపిలో నైట్ క‌ర్ఫ్యూ..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. క‌రోనా కేసులు మ‌ర‌ల పెరుగుతున్న నేప‌థ్యంలో ఎపి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాత్రి 11గంటల నుండి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంద‌ని వెల్ల‌డించారు. నైట్ క‌ర్ఫ్యూ కి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుద‌ల చేయ‌నుంది.

ప్ర‌జ‌లంతా మాస్కులు ధ‌రించేలా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాలి. మాస్కులు ధ‌రించిని వారికి జ‌రిమానాలు విధించాలి. కివిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థంగా ల‌మ‌లు చేయాలి. 50% సామ‌ర్త్యంతో థియ‌ట‌ర్లు న‌డ‌పాలి. వ్యిపార స‌ముదాయాల్లో కొవిడ్ నిబంద‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా సాటించాలి. బ‌స్సుల్లో ప్ర‌యాణికులు మాస్కులు ధ‌రించేలా చూడాలి. బ‌హిరంగ కార్య‌క్ర‌మాల్లో 200 మందికి, ఇండ‌ర్ కార్య‌క్ర‌మాల్లో 100 మందికి మించ‌కూడ‌దు అని సిఎం జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.