NIMS: 24 నుండి ఉచితంగా చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్స..

హైదరాబాద్ (CLiC2NEWS): ఏడాది నుండి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా గుండె శస్త్ర చికిత్స చేయనున్నారు. ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు శస్త్ర చికిత్సలు జరపనున్నట్లు సమాచారం. దీని కోసం బ్రిటన్ నుండి పిడియాట్రిక్ వైద్యులు పది మంది ఇక్కడికి రానున్నారు. ఈ మేరకు నిలోఫర్ , నిమ్స్ వైద్యులు ప్రకటనలో తెలియజేశారు. చార్లెస్ హార్ట్ హీరోస్ క్యాంపు పేరుతో చిన్నారులకు హృదయ సంబంధ వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించనున్నారు. రూ. లక్షలు ఖర్చయ్యే శస్త్ర చికిత్సలు సైతం ఉచితంగా ఆరోగ్య శ్రీ, సిఎం సహాయనిధితో నిర్వహించనున్నారు. అపుడే పుట్టిన చిన్నారుల నుంచి అయిదేళ్ల లోపు ఉన్న చిన్నారులకు పుట్టుకతోగాని, జన్యపరంగా గాని వచ్చే గుండె సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్యారం చూపనున్నారు.
గత సంవత్సరం కూడా ఇదే తరహాలో వారం రోజులు పాటు గుండె సంబంధిత శస్త్ర చికిత్స నిర్వహించి 9 మంది చిన్నారుల ప్రాణాలను నిలబెట్టారు. పూర్తి సమాచారం కొరకు 040-23489025 ఫోన్ నంబర్‌ను సంప్రదించగలరు. ఈ నెంబరుకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలలోపు ప్రయత్నించి తెలుసుకోగలరు.