Olympics: తొమ్మిదేళ్ల తర్వాత రెజ్లింగ్‌లో ఫైనల్‌కు భారత రెజ్లర్
మెడల్ పక్కా: రజతం ఖాయం చేసిన కుస్తీవీరుడు రవికుమార్
టోక్యో (CLiC2NEWS): ఇండియాకు మరో మెడల్ ఖాయం చేశాడు రెజ్లర్ రవికుమార్ దహియా. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో బుధవారం కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై అతడు గెలిచాడు. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చెలాయిస్తున్న వేళ అనూహ్యంగా పుంచుకున్న రవి `విక్టరీ బై పాల్` పద్ధతిలో స్వర్ణపోరుకు అర్హత సాధించాడు. 7-9 తేడాతో కజకిస్థాన్ కుస్తీవీరుడు సనయెవ్ ను ఓడించాడు.
ఈ విజయంతో ఫైనల్లో అడుగుపెట్టిన రవికుమార్.. ఇండియాకు కనీసం సిల్వర్ మెడల్ ఖాయం చేయడం విశేషం. ఇప్పటి వరకూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్, యోగేశ్వర్‌దత్‌లు మాత్రమే ఇండియాకు సిల్వర్ మెడల్స్ అందించారు. వాళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో రెజ్లర్‌గా రవికుమార్ దహియా నిలిచాడు.