వ‌చ్చేనెల 23న భార‌త్‌కు నీర‌వ్ మోడీ అప్ప‌గింత‌!

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌త్‌లోని బ్యాంకుల‌ను ముంచి ఫారెన్ పారిపోయిన వ‌జ్రాల వ్యాపారీ నీర‌వ్ మోడీని ఇండియా తీసుకువ‌చ్చేందుకు అధికారులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నీర‌వ్ మోడీని భార‌త్ కు అప్ప‌గించాల‌నే పిటిష‌న్‌పై లండ‌న్ కోర్టు న‌వంబ‌రు 23న విచారించ‌నుంది.ఈ క్ర‌మంలో భార‌త్ కు నీర‌వ్‌ను అప్పగించేందుకు అవ‌కాశాలున్న‌ట్లు ఆంగ్ల మీడియాల్లో ప‌లు క‌థ‌నాలు వెల్ల‌డించాయి. ఈ నేప‌థ్యంలోభార‌త్ అధికారులు బ్రిటిష్ అధికారుల‌కు ఇటీవ‌ల ప‌లు ప‌త్రాల‌ను కూడా అంద‌జేశారు.

నీర‌వ్ మోడీని భార‌త్ తీసుకొచ్చాక కేవ‌లం మోసం, మ‌నీలాండ‌రింగ్ కేసులో మాత్ర‌మే విచార‌ణ చేస్తామ‌ని దాంతో పాటు విచార‌ణ కోసం ఎవ‌రి క‌స్ట‌డికి ఇవ్వ‌బోమ‌న అధికారులు అంద‌జేసి ప‌త్రాల‌లో పేర్కొన్న‌ట్లు స‌మాచారం. బ్రిటిష్ అధికారుల‌కు ప‌త్రాలు అంద‌జేసిన వారిలో సిబిఐ, ఇడి, సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస్‌, కస్ట‌మ్స్‌, ఆదాయ‌పు ప‌న్ను విభాగం సంయుక్తంగా హామీప‌త్రాలు అంద‌జేసిన‌ట్లు ఆంగ్ల మీడియా క‌థనాలు పేర్కొన్నాయి.

Also Read: సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 2,861 ఎస్ఐ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.