ఎనిమిదో సారి సిఎంగా నితీశ్ ప్రమాణం
పాట్నా (CLiC2NEWS): బిజెపితో తెగతెంపులు చేసుకున్న బిహార్ సిఎం నితీశ్ కుమార్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసినదే. మహాకూటమి సారథిగా నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బిహార్ సిఎంగా ఆయన ఎనిమిదవ సారి బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ నితీశ్ చేత ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ ప్రమాణం చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. భారతీయ జనతా పార్టీని వీడి మహాకూటమి (ఆర్‌జెడి, కాంగ్రెస్) లో చేరారు. 7 పార్టీలతో కూడిన మహాకూటమి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. అందుకు గవర్నర్ ఆమోదించడంతో నేడు సిఎంగా ప్రమాణం చేశారు. మహాకూటమితో పోత్తుతో భాగంగా ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగించారు.