ఎంత మంది పిల్లలుంటే అందరికీ `తల్లికి వందనం`: మంత్రి నారా లోకేశ్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఎపి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమాధాన మిచ్చారు. ఈ సందర్భంగా ఎంత మంది పిల్లలు ఉన్నా `తల్లికి వందనం` అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ, ప్రయివేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. `తల్లికి వందనం` పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.