ప్లాస్టిక్ బ్యాగులు వద్దు.. పేపర్ బ్యాగులే ముద్దు..
అవును ఈ విషయం మనం పదే పదే వల్లెవేస్తున్నాం..అయినా ప్లాస్టిక్ వాడకాన్ని మనం విడువలేక పోతున్నాం. ప్లాస్టిక్ వల్ల మనకు ముప్పు.. అంతేకాదు ప్రపంచాన్ని ముంచేసే జలప్రళయం కూడా రానుంది. అవును ఇది నిజం.. నిజం.. తస్మాత్ జాగ్రత్త. ప్లాస్టిక్ బ్యాగ్ భూమిలో కరిగి పోవటానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది. రోజూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్లాస్టిక్ బ్యాగు లు, ప్లాస్టిక్ సీసాలను భూమిపై పడవేస్తున్నాం. ఇవి సముద్ర గర్భంలోకి చేరుతున్నాయి. ప్లాస్టిక్ సంచులు, బ్యాగులను రీసైక్లింగ్ చేసే వ్యవస్థ సరిగా అమలు కావడంలేదు. వివిధ దేశాలు తమ దేశంలోని చెత్తను, డ్రైనేజీ మురికి కాలువల నీటిని, పరిశ్రమల వ్యర్ధాలనూ రహస్యంగా స్వచ్ఛమైన సముద్రంలోనే వేస్తున్నారు. అందుకే సైలెంట్ గా సముద్ర మట్టాలు పెరుగు తున్నాయి. మానవాళి చేసే తప్పులకు జలం ప్రళయంగా మారి మననే కబళిస్తున్నది.. సో ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. భూమిలో త్వరగా కలిసి పోయే పేపర్ బ్యాగులనే వాడుదాం. పర్యావరణాన్ని కాపాడు కుందాం. మనం నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉందాం.
-ఎస్.వి.రమణా చార్యులు
సీనియర్ జర్నలిస్టు