శరణార్థుల వ్యధకు అక్షర రూపం.. నోబెల్ గెలుచుకున్న అబ్దుల్‌ర‌జాక్ గుర్నా

స్టాక్‌హోమ్ (CLiC2NEWS): ఈ సంవ‌త్స‌రం నోబెల్ సాహిత్య అవార్డును గ‌ల్ఫ్ న‌వ‌లా ర‌చ‌యిత అబ్దుల్ ర‌జాక్ గుర్నా గెలుచుకున్నారు. బ్రిటీష్ పాల‌కుల వ‌ల్ల క‌లిగిన వ‌ల‌స‌వాదం ప్ర‌భావాల‌ను, గ‌ల్ఫ్‌లో విభిన్న సంస్కృతుల మ‌ధ్య న‌లిగిన శ‌ర‌ణార్థుల బాధ‌ల‌ను ర‌జాక్ త‌న ర‌చ‌నాశైలిలో సుస్ప‌ష్టంగా వ్య‌క్తం చేసిన‌ట్లు ఇవాళ స్వీడిష్ అకాడ‌మీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అబ్ధుల్‌ రజాక్‌ గుర్నా1948వ సంవ‌త్స‌రంలో హిందూ మహాసముద్రంలోని జాంబిబర్‌ ద్వీపంలో జన్మించారు. ఆయ‌న 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లండ్‌ వలసవెళ్లారు. 1963లో బ్రిటీష్‌ వలస పాలన నుంచి జాంబిబర్‌ స్వాతంత్య్రం పొంది టాంజానియాలో భాగంగా మారిన త‌ర్వాత అధ్యక్షుడు అబిద్‌ కురుమే పాలనలో అరబ్‌ జాతీయులపై విప‌రీత‌మైన వివక్ష పెరిగింది. గుర్నా కూడా ఇదే అరబ్‌ వర్గానికి చెందిన వారే కావ‌డంతో తన భవిష్యత్తు కోసం, ఈ అరాచక పాలన నుంచి విముక్తి పొందడం కోసం కుటుంబాన్ని ,దేశాన్ని విడిచి 18 ఏళ్ల వ‌య‌స్సులో ఇంగ్లాండ్‌కు వెళ్లారు.

క్యాంట్‌బెరీలోని కెంట్ యూనివ‌ర్సిటీలో ఇంగ్ల‌ష్ అండ్ పొస్ట్ కొలోనియ‌ల్ లిట‌రేచ‌ర్ విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశారు. ఓ శ‌ర‌ణార్థి ఎలా న‌లిగిపోయాడో త‌న ర‌చ‌నాశైలితో ఆక‌ట్టుకున్నారు. 21ఏళ్ల వయసులోనే నవలలు రాయడం ప్రారంభించిన గుర్నా.. ఇప్పటివరకు 10 నవలలు , ఎన్నో చిన్న కథలు రచించారు. 1994లో ఆయన రాసిన ప్యారడైజ్‌ అనే నవల బుకర్‌ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయింది.

1 Comment
  1. mamatha says

    👌👌

Leave A Reply

Your email address will not be published.