Nobel Peace Prize: ఎంపికైన ఇద్దరు జ‌ర్న‌లిస్టులు

ఓస్లో (CLiC2NEWS): ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఈ సంవ‌త్స‌రం ఇద్దరు జ‌ర్న‌లిస్టులను వరించింది. ఫిలిఫ్పీన్స్‌కు చెందిన‌ మారియా రెసా , రష్యాకు చెందిన దిమిత్రీ మురాటోవ్‌ అనే జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మూల‌మైన భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ ప‌రిర‌క్ష‌ణ కోసం వీరు చేసిన కృషికి నోబెల్ క‌మిటీ ఈ పురస్కారానికి ఎంపికచేసింది.

ఫిలిఫ్పీన్స్‌కు చెందిన మారియా రెసా.. ఫిలిప్పీన్స్‌లో క్రమంగా పెరిగిపోతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు. ఆమె ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం ఆమె ‘రాప్లర్‌’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా కంపెనీని 2012లో స్థాపించారు. ఈమి జర్నలిస్టుగా, రాప్లర్‌ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్ర‌చురించారు.

దిమిత్రిమురాటోవ్, ఈయ‌న‌ ర‌ష్యాకు చెందిన జ‌ర్న‌లిస్టు. మీడియా స్వేచ్ఛ‌కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఈయ‌న నొవాజా గ‌జెటా అనే ప్ర‌ముఖ వార్తా ప‌త్రిక వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రు. ఆ ప‌త్రికుకు ఎడిట‌ర్‌గా 24 సంవ‌త్స‌రాలు సేవ‌లందించారు. త‌మ దేశంలో పెరిగిపోయిన అవినీతి, హింస‌. చ‌ట్ట వ్య‌తిరే కార్య‌క్ర‌మాలు, మోసాలు వంటి ఎన్నో సంచ‌ల‌నాత్మ‌క క‌థ‌నాలు ప్ర‌చ‌రించారు. దీంతో ఈప‌త్రిక‌కు ఎన్నోసార్లు బెదిరింపులు ఎదుర‌య్యాయి. ఈ సంస్థ‌కు చెందిన ఆరుగురు జ‌ర్న‌లిస్టులు హ‌త్య‌కు గురయ్యారు. అయినాకాని మురాటోవ్ మాత్రం వెనుక‌డుగు వేయ‌క ధైర్యంగా పోరాడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.