ఉక్రెయిన్ చిన్నారుల కోసం నోబెల్ పుర‌స్కారం వేలం..

రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన నోబెల్ పుర‌స్కారం

న్యూయార్క్ (CLiC2NEWS): ఉక్రెయిన్ శ‌ర‌ణార్థి చిన్నారుల స‌హాయార్థం ప్ర‌తిష్టాత్మ‌కమైన నోబెల్ బహుమ‌తిని వేలానికి ఉంచారు రాష్యాకు చెందిన పాత్రికేయుడు దిమిత్రి ముర‌తోవ్. 2021లో నోబెల్ శాంతి బ‌హుమ‌తిని పొందారు. ర‌ష్య‌న్ ప‌త్రిక నొవ‌యా గెజాటాకు ఎడిట‌ర్ ఇన్ చీఫ్‌గా ఉన్నారు. ఆ దేశ రాజ‌కీయ‌, సామాజిక వ్య‌వ‌హారాల‌పై విమ‌ర్శ‌నాత్మ‌క‌, ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాలు వెలువ‌రించే స్వ‌తంత్ర వార్తా సంస్థ అది. త‌న దేశంలో భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ప‌రిర‌క్ష‌ణ‌కు చేస్తున్నందుకుగానూ ముర‌తోవ్‌కు ఈ అవార్డు ద‌క్కింది. ప్ర‌స్తుతం మార‌తోవ్ ఉక్రెయిన్‌పై జ‌రుపుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

ప్ర‌స్తుతం నోబెల్‌ పుర‌స్కారం వేలంలో రికార్డు స్థాయి ధ‌ర ద‌క్కించుకుంది. 103.5 మిలియ‌న్ డాల‌ర్ల చ‌రిత్ర‌ మొత్తానికి అమ్ముడుపోయింది. ఈ సంద‌ర్భంగా ముర‌తోవ్ మాట్లాడుతూ.. శ‌ర‌ణార్థి చిన్నారుల‌కు సంఘీభావంగా పెద్ద మొత్తం ధ‌ర ల‌భిస్తుంద‌ని అనుకున్నా, కానీ, ఈ స్థాయిలో మాత్రం ఊహించ‌లేదు అని ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ పుర‌స్కారాన్ని వేలానికి ఉంచిన అమెరికాకు చెందిన హెరిటేజ్ ఆక్ష‌న్స్ సంస్థ కూడా ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసింది. వేలంలో వ‌చ్చిన మొత్తాన్ని ఐరాస అనుబంధ సంస్థ యునిసెఫ్‌కు చేరింది. ఈ విష‌యాన్ని యునిసెఫ్ ధ్రువీక‌రించింది. 2014లో నోబెల్ పుర‌స్కారానికి వేలంలో 4.76 మిలియ‌న్ల డాల‌ర్లు వ‌చ్చాయి.

Leave A Reply

Your email address will not be published.