ఫ్రెంచ్ రచయిత్రి ‘అనీ ఎర్నాక్స్’కు సాహిత్యంలో ‘నోబెల్ పురస్కారం’

స్టాక్‌హోం (CLiC2NEWS): ఫ్రాన్స్‌కు చెందిన రచయిత్రి అనీ ఎర్నాక్స్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. ప్రపంచ అత్యుత్తమమైన ఈ పురస్కారంకు ఎంపికైన 17వ మహిళగా అనీ ఎర్నాక్స్ నిలిచారు. వ్యక్తిగత జ్ఞాపకాల మూలాలను, వైరుధ్యాలను, సామూహిక పరిమితులను సూక్ష పరిశీలనతో తన రచనల ద్వారా ధైర్యంగా బహిర్గత పరిచినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఆమెకు లభించింది. సాహిత్య రంగంలో ఆమె రచనలను వాటి విశేషాలను కొనియాడారు. ఆమె రాసిన 30కి పైగా సాహిత్య రచనలు తన జీవితంలోను తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను ప్రతిబింబించేలా సరళమైన భాషలోనే రాశారని నోబెల్ సాహిత్య కమిటీ ఛైర్‌పర్సన్ ఆండర్స్ ఓల్స్‌న్ ప్రశంసించారు.