నోయిడా ట్విన్ టవర్స్.. రూ.1200 కోట్ల ఆస్తి, 10 సెకన్లలో నేలమట్టం
నొయిడా (CLiC2NEWS): నొయిడాలో సూపర్ టెక్ సంస్థ కుతుబ్‌మినార్ కంటే ఎత్తుగా 40 అంతస్తుల జంట భవనాలను నిర్మించింది. ఈ ట్విన్ టవర్స్ నిబంధనలు ఉల్లఘించి అక్రమంగా నిర్మించారని సమీపంలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్డు సొసైటివాళ్లు 2012లో కోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు నిర్మాణ అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు తేల్చి 2014లో భవనాల్ని కూల్చివేయాలని ఆదేశించింది. భవన యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సమారు 9 సంవత్సరాల న్యాయపోరాటం అనంతరం గతేడాది అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భవనాల్ని కూల్చివేయాలని, దానికి మూడు నెలల గడువు ఇచ్చింది.
ఈ టవర్స్‌లో మొత్తం 915 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని అమ్మితే ఆ సంస్థకు రూ. 1200 కోట్లు ఆదాయం వస్తుంది. ఇప్పటికే సంస్థ 613 ప్లాట్లు అమ్మింది. వీటికి గాను తీసుకొన్న మొత్తాన్ని కూడా 12% వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంది. పైగా ఆభవనాల్ని కూల్చడానికి రూ. 20 కోట్ల ఖర్చవుతుంది. ఈ భవనాన్ని కూల్చాడానికి 10 సెకన్ల సమయం పడుతుందని ముంబయికి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. ఈ కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థతో కలిసి దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డెమాలిషన్స్ కలిసి ఈ పని నిర్వహిస్తున్నాయి.
నలుగురు వ్యక్తుల పోరాటం..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని నొయిడాలో సూపర్‌టెక్ సంస్థ 2009లో ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టింది. ఈ భవన నిర్మాణ సమయంలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను పాటించకుండా నిర్మాణం కొనసాగింది. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు..టెలికాం డిపార్ట్‌మెంట్లో డిప్యూటి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి రిటైర్ అయిన ఎస్.కె శర్మ , సిఆర్‌పిఎఫ్‌లో డిఐజిగా పనిచేసి రిటైర్ అయిన టియోటియో, ఎం.కె జైన్, రవి బజాజ్ ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. మొదటగా వీరు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. 2014లో టవర్స్ కూల్చివేయాలని తీర్పు వెలువడింది. దీనిని సవాల్ చేస్తూ కంపెనీ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లారు. సుప్రీంకోర్టు సైతం ఆ టవర్స్ కూల్చివేయాలని తీర్పు నిచ్చింది. మూడు నెలల్లో భవనాలు బిల్డర్ తన సొంత ఖర్చులతో కూల్చివేయాలని ఆదేశించింది. ఆ భవనాల కూల్చివేత వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30 గంటలకు ఆ భవనాలు కప్పకూలాయి.
న్యాయం తమవైపు ఉందనే నమ్మకంతో ఆ నలుగురు వ్యక్తులు చేసిన న్యాయపోరాటానికి 12 ఏళ్ల అనంతరం ఫలితం దక్కింది. ఈ పోరాటానికి వారికి దాదాపు రూ. కొటికిపైనా ఖర్చయింది. స్థానికుల వద్దనుండి విరాళాలు సేకరించి మరీ ముందుకు సాగారు. ఒక్క సుప్రీం కోర్టులోనే ఏడేళ్లపాటు 30 సార్లు విచారణ జరింగింది.
.