తెలంగాణలో తొలిరోజు నామినేషన్లు దాఖలు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం కీలక నేతలు నమినేషన్ పత్రాలు సమర్పించారు. మల్కాజిగిరి లోక్సభ స్థానానికి బిజెపి తరపున మాజి మంత్రి ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. మహబూబ్నగర్ ఎంపి అభ్యర్థిగా డికె అరుణ , నల్గొండ లోక్సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టి అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు.