మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ(MANU) లో నాన్ టీచింగ్ పోస్టులు

MANU: హైద‌రాబాద్ న‌గ‌రంలోని గ‌చ్చిబౌలిలోని ప్ర‌భుత్వ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివ‌ర్సిటీలో 28 నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీ, బిఇ / బ‌ఇబిటెక్, పిజి  ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ భాష‌ల పరిజ్ఞానం , కంప్యూట‌ర్  టైపింగ్ స్కిల్స్ తో పాటు పని అనుభ‌వం ఉండాలి. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఈ నెల 31 లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా.. ది అసిస్టెంట్ రిజిస్ట్రార్ , ఇఆర్‌-2 సెక్ష‌న్‌, రూం. నెం. 107, అడ్మిన్ బిల్డింగ్, మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటి , గ‌చ్చిబౌలి , హైద‌రాబాద్‌.

Leave A Reply

Your email address will not be published.