ముఖ్యమంత్రిగా కాదు… ఓ సోదరిగా వచ్చా: బెంగాల్ సిఎం మమత

కోల్‌కతా (CLiC2NEWS): సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్య విద్యార్థి హత్యాచార ఘటనపై గత నెల రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా జూ.డాక్లర్లకు, సర్కార్‌కు మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం బెంగాల్ సిఎం మమత బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇవాళ నిరసన శిబిరానికి వెళ్లి జూనియర్ డాక్టర్లతో మాట్లాడారు. తిరిగి విధుల్లో చేరాలని స్వయంగా మమత వైద్యులను కోరారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆందోళన చేస్తున్న మీకు కచ్చితంగా న్యాయం చేస్తానని సిఎం మమత చెప్పారు. అగాయిత్యానికి సంబంధించిన బాధ్యులను కఠినంగా శక్షిస్తాం. ఆర్జీ కర్ ఆసుపత్రిలో రోగుల సంరక్షణ కమిటీని రద్దు చేస్తున్నా… దర్యప్తును మరింత వేగవంతం చేయాలని సిబిఐని కోరుతున్నా… నామీద విశ్వాసం, నమ్మకం ఉంటే చర్చలకు రండి.. మీరు వెంటనే విధుల్లో చేరండి.. మీ మీద ఎలాంటి చర్చలు తీసుకోబోం అని మమత అన్నారు.
తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.