నగరంలో ఉన్న నలుగురు పాక్ పౌరులకు నోటీసులు..
రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలి..

హైదరాబాద్ (CLiC2NEWS): పహల్గాం ఉగ్రదాడి పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా భారత్‌లో ఉన్న పాక్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని సూచించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్థానీయులను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు గుర్తించారు. నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్నట్లు సమాచారం. వీరిని రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఆదేశించారు.
పహల్గాంలో పర్యాటకులపై జరగిన ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు ముష్కరులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాలను భద్రతా దళాలు గుర్తించి, ధ్యంసం చేసినట్టు సమాచారం. అక్కడ నుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.