మాజి సిఎం కెసిఆర్‌కు నోటీసులు.. జ‌స్టిస్ ఎల్‌. న‌ర‌సింహారెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజి సిఎం కెసిఆర్ స‌హా 25 మందికి నోటీసులు ఇచ్చిన‌ట్లు జ‌స్టిస్ ఎల్‌.న‌ర‌సింహారెడ్డి తెలియ‌జేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛ‌త్తీస్‌గ‌ఢ్ క‌రెంటు కొనుగోలుకు గ‌త ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానంపై విచార‌ణ‌కు ఏర్పాటైన జ‌స్టిస్ న‌ర‌సింహారెడ్డి జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ విచార‌ణ కొన‌సాగుతోంది. దీనికి సంబంధించి కెసిఆర్‌, సురేశ్ చందా, అజ‌య్ మిశ్రా స‌హా 25 మందికి నోటీసులు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. దీనిపై జూన్ 15 లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని తెలుప‌గా.. కెసిఆర్ జులై 30 వ‌ర‌కు స‌మ‌యం అడిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.