రాష్ట్రంలో మరో 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విభాగాలలో ఎఈఈ 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 14 వరకు స్వీకరించనున్నారు.
రవాణా శాఖలో ఎఎంవిఐ పోస్టుల నోటిఫికేషన్ను టిఎస్ పిఎస్సి రద్దు చేసింది. 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి జులై 27న టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడం..అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతల విషయంలోనూ పలు విజ్ఞప్తులు వచ్చినందువల్ల ఈ పోస్టుల నోటిఫికేషన్ను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నుండి వచ్చిన విజ్ఞప్తులన్నిటినీ రవాణాశాఖకు తెలియజేసినట్లు టిస్పిఎస్సి వివరించింది.