భారత నౌకాదళంలో 910 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఐటిఐ, డిప్లొమో, డిగ్రీ విద్యార్హతలతో ఇండియన్ నేవీలో 910 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రూప్‌బి, గ్రూప్ సి విభాగాల్లో ఉన్న ఖాళీలకు పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మహిళలు కూడా ఈ పరీక్షలకు పోటీపడవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారు చార్జ్‌మెన్, సీనియర్ డ్రాప్ట్స్‌మెన్, డ్రేడ్స్‌మెన్ మేట్ హోదాతో విధులు నిర్వహిస్తారు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణలైన వారిని సాధారణ వైద్య పరీక్షలతో పోస్టులకు ఎంపిక జరుగుతుంది.
గ్రూప్ బి పోస్టులకు ఎంపికైన వారు లెవల్ -6 వేతనం.. రూ. 35,400 అందుకోవచ్చు. దీంతో పాటు అలవెన్సులు అన్నీ కలిపి రూ. 55,000 వరకు ఉంటుంది. వీరు ఇంజినీర్లు, అధికారులకు సహాయకులుగా ఉంటారు. గ్రూప్ సి పోస్టులకు ఎంపికైన వారికి మూల వేతనం రూ. 18,000 గా ఉంటుంది. అలవెన్సులతో కలిపి మొదటి నెల నుండే రూ. 30,000 వరకు పొందవచ్చు.
గ్రూప్ బిలో ఉన్న పోస్టుల వివరాలు
ఛార్జ్‌మెన్ వర్క్ షాప్ ఖాళీలు.. 22 బిఎస్‌సి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రి తప్పనిసరిగా ఉండాలి లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమో ఉండాలి
ఛార్జ్ ఫ్యాక్టరి 20..బిఎస్‌సి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రి తప్పనిసరిగా ఉండాలి లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిప్లమా ఉండాలి
సీనియర్ డ్రాప్ట్‌మెన్
ఎలక్ట్రికల్ 142, మెకానికల్ 26, కన్‌స్ట్రక్షన్ 29, కార్టోగ్రాఫిక్ 11, ఆర్మమెంట్ 50 .. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైన రెండేళ్ల డిప్లొమా లేదా డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక చేసుకున్న విభాగం ప్రకారం మెకానికల్, ఎలక్ట్రికల్, నేవల్ అర్కిటెక్చర్ , కార్టొగ్రఫి వీటిలో ఎందులోనైనా మూడేళ్ల డ్రాయింగ్ / డిజైన్ అనుభవం ఉండాలి.
గ్రూప్ సిలో ఉన్న పోస్టుల వివరాలు
డ్రాప్ట్స్‌మెన్ మేట్ లో మొత్తం 610 ఖాళీలు ఉన్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ 9, వెస్ట్రన్ నేవల్ కమాండ్ 565, సదరన్ నేవల్ కమాండ్ 36 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్వేశిత ట్రేడుల్లో ఐటిఐ సర్ఘిపికెట్ అవసరం. నోటిఫికేషన్లో పేర్కొన్న 64 ఐటిఐ ట్రేడుల్లో ఏదైనా పూర్తి చేసిన వారు అర్హులు. పూర్తి వివరాలకు https://joinindiannavy.gov.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.