రైల్వేలో 9,144 టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

ఢిల్లీ (CLiC2NEWS) : రైల్వే శాఖ‌లో టెక్నీషియ‌న్ పోస్టులను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. మొత్తం 9,144 టెక్నీషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటికోపం ఏప్రిల్ 8వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. ఈ పోస్టుల‌లో గ్రేడ్‌-1 సిగ్న‌ల్ 1092 పోస్టులు ఉండ‌గా.. టెక్నీషియ‌న్ గ్రేడ్‌-3 పోస్టులు 8,052 ఉన్నాయి.

అభ్య‌ర్థులు వ‌య‌స్సు జులై 1, 2024 నాటికి గ్రేడ్‌-1 ఉద్యోగాల‌కు 18 నుండి 36 ఏళ్ల లోపు ఉండాలి. గ్రేడ్‌-3 ఉద్యోగాల‌కు 18 నుండి 33 ఏళ్ల‌లోపు వారై ఉండాలి. ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 500గా నిర్ణ‌యించారు. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష రాసిన త‌ర్వాత రూ. 400 రిఫండ్ చేస్తారు. మ‌హిళ‌లు, ఎస్‌సి, ఎస్‌టి, ఎక్స్ స‌ర్వీస్‌మెన్ థ‌ర్డ్ జెండ‌ర్‌, మైనారిటీలు, ఇబిసిలు రూ. 250 చొప్పున చెల్లించాలి. ఈ మొత్తాన్ని ప‌రీక్ష త‌ర్వాత రిఫండ్ చేస్తారు. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష ద్వారా ఎంపిక జ‌రుగుతుంది. గ్రేడ్ 1 పోస్టుల‌కు ప్రారంభ వేత‌నం రూ. 29,200.. గ్రేడ్-3 ఉద్యోగాల‌కు రూ 19,900గా ఉంది.

Leave A Reply

Your email address will not be published.