గురుకుల సైనిక పాఠశాలలో ప్రవేశానికి నోటిఫికేషన్
హైదరాబాద్ (CLiC2NEWS): కరీంనగర్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలోని సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేశారు. రుక్మాపూర్‌లో బాలురు కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక స్కూల్‌లో నేటి నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూటూషన్స్ సొసైటి కార్యదర్శి తెలిపారు. ఈ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్‌లో ఎంపిసి – 80 సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థుల ఎంపిక.. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించనున్నారు.