నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

Navodaya: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 653 జెఎస్‌విలలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. విద్యార్థులను రెండు విడతల్లో నిర్వహించే పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్థులు మే 1, 2013 నుండి జులై 31, 2015 మధ్య జన్మించి ఉండాలి.
నవోదయ ప్రవేశం పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లల్లో నివాసి అయి ఉండాలి. 2024-2025 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ , ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. అర్హత గల విద్యార్థులు సెప్టెంబర్ 16 లోపు దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో 2025 జనవరి 18వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.