TS: ఎపిపి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎపిపి) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 151 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 34 సంవత్సరాలు మించకుండా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. న్యాయ విద్యలో పట్టా పొందిన వారు దరఖాస్తులకు అర్హులు. ఎస్ టి, ఎస్సీ అభ్యర్థులు రూ. 750, ఇతరులు రూ. 1500 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. దీనికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. w.w.w.tslprb.inలో నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చని పోలీసు నియామక మండలి వివరించింది.