టిఎస్పిఎస్సి ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/TS-logo.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్పిఎస్సి ఛైర్మన్ బి.జనార్ధన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నూతన ఛైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రశ్నాపత్రాల లీకేజి నేపథ్యంలో టిఎస్పిఎస్సిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కమిషన్ ఛైర్మన్, సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజినామా పత్రాలను గవర్నర్ ఆమోదించారు.