తెలంగాణ శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్లు స్వీకరించనున్నారు. 12వ తేదీన శాసస మండలిలో డిప్యూటి ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. అధికార పార్టీకి చెందిన ఎమ్ఎల్‌సి బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరును ఖరారా చేశారు. బిఆర్ ఎస్ మెజార్టి అధికంగా ఉన్న నేపథ్యంలో డిప్యూటి ఛైర్మన్‌గా బండప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 2021 నవంబర్ లో బండ ప్రకాశ్ ఎమ్ ఎల్‌సిగా ఎన్నికయ్యారు. శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్నారు.