గ్రూప్-3.. 1,365 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/tspsc.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. పోలీసు శాఖ, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4.. ఇపుడు తాజాగా గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న 1,365 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ టిఎస్‌పిఎస్‌సి విడుదలచేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తులను జనవరి 24వ తేదీ నుండి ఫిబ్రవరి 23 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు.