చేనేత‌, జౌళిశాఖ‌లో 30 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

హైద‌రాబాద్ (CLiC2NEWS): చేనేత , జౌళిశాఖ‌లో 30 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. క్ల‌స్ట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ 8, టెక్స్‌టైల్ డిజైన‌ర్ ఉద్యోగాలు 22 ఉన్నాయి. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేవారు ఐఐహెచ్‌టి నుండి చేనేత టెక్నాల‌జిలో డిప్లొమో చేసి ఉండాలి. అర్హులైన అభ్య‌ర్థులు త‌మ పూర్తి వివ‌రాల‌తో పాటు సంబంధిత ధ్రువ‌ప‌త్రాల‌తో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా రామ‌య్య‌ర్ ప్ర‌క‌టించారు. ఎంపికైన వారిని తాత్కాలిక ప‌ద్ధ‌తిన మూడేళ్ల పాటు ప‌నిచేయాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.